‘ఇందిరమ్మ’ సర్వే వేగిరం
● జిల్లాలో 1,07,398 దరఖాస్తులు ● పూర్తయినవి 48,393 ● ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని లక్ష్యం ● ప్రత్యేక యాప్‌లో వివరాల నమోదు
సిరిసిల్లటౌన్/గంభీరావుపేట(సిరిసిల్ల): నిరుపేదల సొంతింటి కలను నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే కొనసాగుతోంది. ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా అర్హుల వివరాలు సేకరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రెండు మున్సిపాలిటీలు, 13 మండలా ల్లో కలిపి 1,07,398 దరఖాస్తులు ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చాయి. ఆయా దరఖాస్తుల ఆధారంగా అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు. లబ్ధి దారుల ఎంపిక కోసం ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. అధికారులు సేకరించిన వివరా లను ఆ యాప్‌లో పొందుపరుస్తున్నారు. అధికారులు ఇందిరమ్మ ఇళ్ల కమిటీలతో కలిసి వివరాలు సేకరిస్తున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు తెలుసుకుంటున్నారు.
9 రోజులు.. 59,005 దరఖాస్తులు
ప్రజాపాలనలో 1,07,398 దరఖాస్తులు రాగా ఇప్పటి వరకు 48,393 దరఖాస్తుల సర్వే పూర్తయింది. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా రంగంలోకి దిగి, ఈనెలాఖరులోగా మిగతా 59,005 దరఖాస్తుల సర్వే పూర్తి చేయాలని ఆదేశించడంతో అధికారులు వేగం పెంచారు. మున్సిపాలిటీల్లో వార్డు అధికారులు, జీపీల్లో పంచాయతీ సెక్రటరీలు, ఇతరులు 352 మంది సర్వేలో పాల్గొంటున్నారు. రానున్న 9 రోజుల్లోనే 44.94శాతం సర్వేను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. గ్రామాల్లో పంచాయ తీ కార్యదర్శులు, మున్సిపాలిటీల్లో వార్డు అధికారులు ఒక్కొక్కరు రోజుకు 25 దరఖాస్తులు పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేయనుంది.
స్థలం ఉందా.. లేదా..
ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో లాగిన్ అయ్యేందుకు ప్రభుత్వం కార్యదర్శులకు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ అందించింది. కార్యదర్శులు మొబైల్‌ఫోన్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఐడీ, పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అవుతున్నారు. యాప్ ఓపెన్ కాగానే వా రికి కేటాయించిన లబ్ధిదారుల వివరాలు అందులో ఉంటాయి. దరఖాస్తుదారుడి మొబైల్‌నంబర్‌కు ఫోన్‌చేసి వారి ఇంటికెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఇంటి స్థలం, వారు ఉంటున్న ఇల్లు అద్దెనా.. సొంతమా అని విచారణ చేపడుతున్నారు. స్థలం ఉంటే.. ఎక్కడ ఉంది అనే వివరాలు పొందుపరుస్తున్నారు.
రోజుకు 10వేల దరఖాస్తులు
ఇందిరమ్మ సర్వే వేగవంతంగా చేపడుతున్నాం. క్షేత్రస్థాయి సిబ్బందికి సహాయకులను పెంచుతున్నాం. ఇప్పటికే 352 మందికి లాగిన్, పాస్‌వర్డులు అందించాం. అవసరాన్ని బట్టి మరికొంత మందికి సర్వే లాగిన్ బాధ్యతలు అప్పగిస్తాం. ఈనెలాఖరు వరకు సర్వేను పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నాం.
– శేషాద్రి, డీఆర్‌డీఏ
మండలం దరఖాస్తులు సర్వే పూర్తయినవి
బోయినపల్లి 6,976 3,194
చందుర్తి 6,420 3,068
ఇల్లంతకుంట 10,216 5,669
గంభీరావుపేట 8,761 3,133
కోనరావుపేట 8,299 3,297
ముస్తాబాద్ 9,460 4,269
రుద్రంగి 3,780 1,064
తంగళ్లపల్లి 9,528 4,167
వీర్నపల్లి 3,668 2,664
వేములవాడ 4,960 1,766
వేములవాడరూరల్ 4,759 2,399
ఎల్లారెడ్డిపేట 9,526 2,775
వేములవాడ మున్సిపాలిటీ 8,591 5,194
సిరిసిల్ల మున్సిపాలిటీ 12,454 5,734
మొత్తం 1,07,398 48,393
Comments
Please login to add a commentAdd a comment