విలీన గ్రామాన్ని విడదీయండి
● ఎమ్మెల్యేకు గ్రామస్తుల వినతి
వేములవాడరూరల్: వేములవాడ మున్సిపాలిటీలో విలీనం చేసిన శాత్రాజుపల్లిని విడదీసి గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ఆ గ్రామస్తులు సోమవారం వినతిపత్రం అందజేశారు. మున్సిపాలిటీలో విలీనమైన సందర్బంలో గ్రామస్తుల అభిప్రాయాలు తీసుకోలేదన్నారు. నిరుపేదలకు ఉపాధిహామీ పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తిరిగి గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయిస్తానని చెప్పిన హామీని గుర్తు చేశారు.
ప్రవేశపరీక్ష పోస్టర్ ఆవిష్కరణ
వేములవాడఅర్బన్: గురుకుల విద్యాసంస్థల ప్రవేశపరీక్ష పోస్టర్‌ను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సోమవారం ఆవిష్కరించారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళా శాల ప్రిన్సిపాల్ జ్యోతి, లావణ్య ఉన్నారు.
తిరుప్పావై ప్రవచకులకు సన్మానం
సిరిసిల్లటౌన్: ధనుర్మాసం సందర్భంగా సిరిసిల్ల శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నెల రోజులుగా సందుగు వేణుగోపాలాచార్యులు తిరుప్పావై ప్రవచనాలు చెబుతున్నారు. సోమవారం చివరి రోజు కావడంతో వేణుగో పాలచార్యుల దంపతులను శాలువాతో సత్కరించారు. ఈవో మారుతిరావు, టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, అర్చకస్వా ములు కృష్ణమాచారి, వర్ధనాచారి ఉన్నారు.
కాంగ్రెస్ తీరు బాధాకరం
● నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు
సిరిసిల్లటౌన్: ఏడాదిగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర భుత్వం తీరు బాధాకరంగా ఉందని నాఫ్స్కా బ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు పేర్కొన్నా రు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ పాలనలో అందరికీ సమాన గౌరవం ఇచ్చామని, కాంగ్రెసోళ్లు అధికార పార్టీ నేతలకు మాత్రమే అభివృద్ధి నిధులు ఇస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవా లని సూచించారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, గూడూరి ప్రవీణ్, దార్నం లక్ష్మీనారా యణ, గుండ్లపెల్లి పూర్ణచందర్ పాల్గొన్నారు.
మందా జగన్నాథంకు నివాళి
సిరిసిల్లటౌన్: నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథంకు ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో సిరిసిల్లలో ఆదివారం నివాళి అర్పించారు. ఎమ్మెస్పీ జిల్లా అధ్యక్షుడు కానాపురం లక్ష్మణ్, గుండా థామస్, సాంస్కృతిక జిల్లా అధ్యక్షుడు గజ్జల అశోక్, ఆకునూరి దేవయ్య, పసుల దుర్గయ్య, మంగలి చంద్రమౌళి, కంసాల మల్లేశం పాల్గొన్నారు.
కాటిరేవుల పండుగ
వేములవాడఅర్బన్: వేములవాడ మున్సిపల్ పరిధి నాంపల్లి, తిప్పాపూర్ రైతులు సోమవారం కాటిరేవుల పండుగ ఘనంగా నిర్వహించారు. తమ కష్టంలో పాలుపంచుకొంటున్న కష్టపడుతున్న ఎడ్లను ప్రత్యేకంగా అలంకరించారు. కొమ్ములకు జాజురంగు పూసి, పూలు చేశారు. రైతులు ఎలా రాజయ్య, పోషవేణి రమేశ్, నర్సయ్య, వెంకటి, శ్రీనివాస్, బుర్ర లింగయ్య తదితరులు ఉన్నారు
Comments
Please login to add a commentAdd a comment