రథోత్సవం.. రమణీయం
ఇల్లంతకుంట(మానకొండూర్): మూడు రోజులుగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్న జంగారెడ్డిపల్లి రామలింగేశ్వరస్వామి జాతర ఉత్సవాలు గురువారం ముగిశాయి. చివరి రోజు నిర్వహించిన రథోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. తమ గండాలు తొలగిపోవాలని పలువురు భక్తులు గండదీపం మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ సిద్ధం వేణు రథోత్సవంలో పాల్గొన్నారు. అర్చకులు పవన్‌శర్మ, విఠల్‌శర్మ, లింగమూర్తి ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. ఎస్సై శ్రీకాంత్‌గౌడ్ బందోబస్తు చేపట్టారు. ఇల్లంతకుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు సేవలందించారు. పీహెచ్‌సీ సిబ్బంది వైద్యశిబిరం ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment