26 నుంచి కొత్త పథకాలు
● మానకొండూర్ ఎమ్మెల్యే సత్యనారాయణ
ఇల్లంతకుంట(మానకొండూర్): మరో నాలుగు కొత్త పథకాలను ఈనెల 26 నుంచి అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని జంగారెడ్డిపల్లి రామలింగేశ్వరస్వామి జాతరలో గురువారం పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు, గణతంత్ర దినోత్సవం నుంచి అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బి.రాఘవరెడ్డి, ప్యాక్స్ మాజీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, నాయకులు పసుల వెంకటి, అంతగిరి వినయ్‌కుమార్, మంద బాల్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
నార్మల్ డెలివరీలు చేయాలి
● జిల్లా వైద్యాధికారి రజిత
సిరిసిల్ల: ప్రైవేటు ఆస్పత్రుల్లో నార్మల్ డెలివరీలు చేయాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం జిల్లాలోని గైనకాలజిస్ట్‌లతో సమావేశమయ్యారు. డాక్టర్ రజిత మాట్లాడుతూ మొదటి కాన్పులోనే సాధారణ ప్రసవం చేయాలని, సీ సెక్షన్ తగ్గించాలని సూచించారు. స్కానింగ్ సెంట ర్లలోని రేడియాలజిస్ట్‌ల పేర్లను సర్టిఫికెట్లలో పొందుపరచాలన్నారు. వైద్యులు అంజలినా ఆల్ఫ్రెడ్, లక్ష్మీనారాయణ, పెంచలయ్య, సుగుణ, నయీమ, శోభారాణి, లీలాశిరీష, ఉమా, శ్రీవాణి, సత్యనారాయణ పాల్గొన్నారు.
కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా వనిత
సిరిసిల్లటౌన్: కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురా లిగా రెండోసారి కాముని వనితను నియమించారు. పార్టీకి ఆమె అందిస్తున్న సేవలను గుర్తిస్తూ వరుసగా రెండోసారి మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా పార్టీ నియమించింది. ఈమేరకు గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మొగిలి సునీతారావు చేతుల మీదుగా నియామకపత్రం అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment