అమర జవాన్ అనిల్‌కు నివాళి
బోయినపల్లి(చొప్పదండి): హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన బోయినపల్లి మండలం మల్కాపూర్‌కు చెందిన అమర జవాన్ పబ్బాల అనిల్‌కుమార్‌కు గ్రామస్తులు ఘనంగా నివాళి అర్పించారు. సైనిక దినోత్సవం సందర్భంగా అనిల్‌కు సేనా అవార్డు, ఆయన సతీమణి సౌజన్యకు వీరనారీ టైటిల్ అందించిన విషయం తెలిసిందే. ఈ అవార్డును అతని భార్య, పిల్లలు అయాన్, అరయ్‌లతో కలిసి అనిల్ విగ్రహం వద్ద పెట్టి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అనిల్ స్వగ్రామంలో గ్రామస్తులు కొవ్వొత్తులతో ర్యాలీ తీశారు. జాతీయ బీసీ యువజన సంఘం అధ్యక్షుడు దండు వినోద్, జిల్లా కుర్మ సంఘం అధ్యక్షుడు ఏనుగుల కనకయ్య, యువజ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కౌడగాని వెంకటేశ్, మండలాధ్యక్షుడు ఏనుగుల అనిల్‌కుమార్, బత్తుల మహేందర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment