పురిటిగడ్డ రుణం తీర్చుకుంటా
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ● రుద్రంగిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
రుద్రంగి(వేములవాడ): నా సొంతూరు ప్రజలు ఇచ్చిన అవకాశంతో పురిటిగడ్డ రుణం తీర్చుకుంటానని, రుద్రంగిని నియోజకవర్గంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రుద్రంగి మండలంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, రాష్ట్ర కోపరేటీవ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డితో కలిసి రూ.2.3 కోట్ల అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ 2009 కంటే ముందే రుద్రంగి నాగారం, ఫాజుల్‌నగర్ రిజర్వాయర్‌లను పూర్తి చేసుకున్నామన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో వేములవాడ వెనకబడిందన్నారు. రానున్న రోజుల్లో జిల్లాను అభివృద్ధి పథంలో నిలుపుతానన్నారు. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు జనవరి 26 నుంచి అందిస్తామని తెలిపారు. రైతుభరోసాతో ప్రతీ ఎకరాకు రూ.12వేలు అందజేయనున్నట్లు చె ప్పారు. గత ప్రభుత్వం ఆర్భాటాలకు పోయి రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుద్రంగి మండలం మానాలకు వచ్చిన విప్.. చిన్నతనంలో తాను ఆడి, పెరిగిన తాత ఇంటిని చూసి ఆనాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు. స్థానికులతో ముచ్చటించారు. ఈఈ సుదర్శన్‌రెడ్డి, ఆర్డీవో శేషాద్రి, డీఈ పవనకుమారి, తహసీల్దార్ శ్రీలత, ఎంపీడీవో నట రాజ్, రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, పీఆర్ ఏఈ మనోహర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment