కమనీయం గోదారంగనాథుల కల్యాణం
సిరిసిల్లటౌన్: సిరిసిల్లలో గోదారంగనాథుల కల్యాణం సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పచ్చని పందిళ్లు, ముత్యాల తలంబ్రాలు, భాజాభజంత్రీల మధ్య కల్యాణోత్సవం సాగింది. ఆలయ ప్రధాన అర్చకులు ఈ వేడుకలు నిర్వహించారు. ఏటా ధనుర్మాసోత్సవాల్లో భాగంగా చివరి రోజున కల్యాణ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. ముత్తయిదువులు గోదామాతకు ఓడిబియ్యం సమర్పించారు. అర్చకులు కృష్ణమాచారి, వేణుగోపాలాచారి, వర్ధనాచారి వేడుకలు నిర్వహించారు. అనంతరం 2వేల మందికి అన్నదానం చేశారు. ఆలయ ఈవో మారుతిరావు, ఏఈవో రవీందర్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు ఉప్పుల విఠల్‌రెడ్డి, తీగల శేఖర్‌గౌడ్, చేపూరి నాగరాజు, టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వేములవాడఅర్బన్: వేములవాడలోని శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో గోదాదేవిరంగనాథ స్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు. స్థానాచార్యులు అప్పాల భీమాశంకరశర్మ, నమిలికొండ రాజేశ్వరశర్మ, దుమాల నాగరాజు, ఆలయ ఏఈవో బ్రాహ్మణగారి శ్రీనివాస్ పాల్గొన్నారు.
రెండువేల మందికి అన్నదానం
శ్రీశాల క్షేత్రంలో పోటెత్తిన భక్తజనం
Comments
Please login to add a commentAdd a comment