● పెరిగిన చలిలో చన్నీటి స్నానాలు
షాబాద్: షాబాద్ ఎస్సీ, బీసీ హాస్టళ్లలో విద్యార్థులకు బ్లాంకెట్లు, బెడ్‌షీట్లు పంపిణీ చేశారు. అయినా చలికి తట్టుకోలేక ఇంటి నుంచి తెచ్చుకున్నవి కూడా వాడుకుంటున్నారు. ఎస్సీ హాస్టల్‌లో 106 మంది విద్యార్థులు ఉన్నారు. సోలార్ వాటర్ హీటర్లు పనిచేయడం లేదు. ప్రతిరోజూ విద్యార్థులు చన్నీటితో స్నానం చేస్తున్నారు. వాటర్ ఫిల్టర్ పనిచేకపోవడంతో బోరు నీరు తాగుతున్నారు. బీసీ హాస్టల్‌లో 95 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. బీస్సీ హాస్టల్‌లో వాటర్ హీటర్ లేకపోవడంతో చన్నీటి స్నానం చేస్తున్నారు. సరిపడా బాత్రూంలు కూడా లేవు. బెడ్‌షీట్లు పంపిణీ చేసినా చలికి తట్టు కోలేక కొంతమంది ఇంటి నుంచి తెచ్చుకున్నారు.
వాటర్ హీటర్లు అమర్చాలి
చలి ఉన్నా ఆరుబయట చల్లటి నీటితోనే స్నానం చేస్తున్నాం. చలి గాలులకు వణికిపోతున్నాం. అధికారులు స్పందించి కొత్త సోలార్ వాటర్ హీటర్లు అమర్చాలి.
– ప్రవీణ్‌కుమార్, 10వ తరగతి, బీసీ హాస్టల్, షాబాద్
Comments
Please login to add a commentAdd a comment