చేవెళ్ల: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించేందుకు డివిజన్ కేంద్రంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఆర్డీఓ కార్యాలయం వద్ద ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమంతో అందుబాటులో ఉంటామని చెప్పారు. ఉదయం 10–30 గంటల నుంచి మధ్యాహ్న ం 2 గంటల వరకు ప్రజావాణి ఉంటుందన్నారు. డివిజన్‌లోని ప్రజలు తమ సమస్యల ఫిర్యాదులను నేరుగా అందించవచ్చున ని చెప్పారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
కారులో తరలిస్తున్నగంజాయి స్వాధీనం
శంషాబాద్ రూరల్: కారులో గంజాయి తరలిస్తున్న ఇద్దరు పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసుల సమాచారం మేరకు... ఖమ్మంకు చెంరిన భానుతేజ రెడ్డి(25), వరంగల్‌కు చెందిన రాజ్‌కుమార్(26) నగరంలో ప్రైవేటు ఉద్యోగం చేస్తుంటారు. వీరు మారుతి కారులో శుక్రవారం బెంగుళూరు నుంచి హైదరాబాద్ వస్తున్నారు. తొండుపల్లి వద్ద పోలీసులు కారును ఆపి తనిఖీ చేయగా.. వారి వద్ద ఉన్న 70 గ్రాముల గంజాయి దొరికింది. వీరు గంజాయిని సేవించడమే కాకుండా విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment