శంకర్‌పల్లి: మద్యం మత్తులో బైక్ నడిపి, ఐదు నెలల గర్భిణి మృతికి కారణమైన వ్యక్తికి ఎల్‌బీనగర్ కోర్టు పదేళ్ల జైలు, రూ.10 వేల జరిమానా విధించింది. శంకర్‌పల్లి సీఐ శ్రీనివాస్‌గౌడ్ కథనం ప్రకారం.. 2021లో చేవెళ్ల మండలం కందవాడ గ్రామానికి చెందిన ఫిరంగి రవి, తన భార్య లక్ష్మిని ఆస్పత్రిలో చూపించేందుకు శంకర్‌పల్లికి వచ్చాడు. ఇద్దరూ బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యారు. శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని రామంతాపూర్ వద్ద వెనక నుంచి మద్యం మత్తులో, అతివేగంగా బైక్‌పై వచ్చిన మాదారం వాసి అనిల్‌కుమార్ (24) వీరిని బలంగా ఢీకొట్టాడు. దీంతో లక్ష్మి బైక్‌పైనుంచి కిందపడిపోయింది. తలకు బలమైన గాయాలు కావడంతో ఆమెను శంకర్‌పల్లి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. శనివారం ఎల్‌బీనగర్ సెషన్స్ కోర్టు జడ్జి హరీష నిందితుడు అనిల్ కుమార్‌కు పదేళ్ల జైలు, రూ.10 వేల జరిమానా విధించింది.
Comments
Please login to add a commentAdd a comment