నీరజ్ ‘టాలెంట్’
ఇబ్రహీంపట్నం: చర్లపటేల్‌గూడ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కప్పపహాడ్ గ్రామానికి చెందిన నీరజ్ మాథ్స్‌లో ‘టాలెంట్’ చాటుతున్నాడు. ఈనెల 16 జరిగిన మండల స్థాయి గణిత టాలెంట్ టెస్ట్‌లో ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ నెల 19న జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో ద్వితీయ స్థానాన్ని దక్కించుకొని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. తమ మ్యాథ్స్ టీచర్ శ్రీనివాస్ చక్కని బోధనతో తనకు గణితంపై ఆసక్తి పెరిగిందని చెబుతున్నాడు. ఉపాధ్యాయులు చెప్పింది శ్రద్ధగా విని, సాధన చేస్తే గణితమంత సులువైన సబ్జెక్ట్ ఏదీలేదంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment