హిందువుల మనోభావాలను దెబ్బ తీయొద్దు
మొయినాబాద్‌రూరల్: హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. మండలంలోని తోల్‌కట్ట సమీపంలో ఉన్న హనుమాన్ దేవాలయం నుంచి శుక్రవారం రాత్రి దుండగులు విగ్రహం, పూజా సామగ్రి బయట పడేయడంపై బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఇలాంటి చర్యలకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మొయినాబాద్ సీఐ పవన్‌కుమార్‌రెడ్డి సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. రెండుమూడు రోజుల్లో దుండగులను పట్టుకొని కేసులు నమోదు చేస్తామని నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీరామ్‌నగర్ ప్రభాకర్‌రెడ్డి, తోల్‌కట్ట మాజీ సర్పంచ్ శ్రీనివాస్, హనుమాన్ దేవాలయ కమిటీ చైర్మన్ అంజయ్య, నాయకులు అంజన్‌కుమార్‌గౌడ్, ప్రకాష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment