కార్తీక్.. గణితంలో సూపర్బ్
షాద్‌నగర్‌రూరల్: గణితం అంటే చాలా కష్టమని అంతా అనుకుంటుంటారు. కానీ ఆ విద్యార్థి మాత్రం అందులోనే ఆసక్తిని పెంచుకున్నాడు. మాస్టారు చెప్పిన గణిత గుణాంకాలపై పట్టు సాధిస్తున్నాడు. మండల, జిల్లా స్థాయిలో నిర్వహించిన మ్యాథమెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబరిచి పతకాలను అందుకున్నాడు. ఫరూఖ్‌నగర్ మండలం విఠ్యాల గ్రామానికి చెందిన శ్రీను, యశోద దంపతుల కుమారుడు కార్తీక్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి లెక్కలపై ఆసక్తిని పెంచుకున్నాడు. లెక్కల్లో తోటి విద్యార్థులకన్నా మంచి మార్కులు సాధిస్తూ గణితంపై పట్టు సాధిస్తున్నాడు. కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే అన్ని సబ్జెక్టులకంటే గణితం ఎంతో సులువు అని నిరూపిస్తున్నాడు. లెక్కలపై వేసిన ప్రశ్నలకు సునాయాసంగా జవాబులు చెబుతూ ఉపాధ్యాయులతో ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇటీవల నిర్వహించిన మండల, జిల్లా స్థాయి మాథమెటిక్స్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బహుమతులు అందుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment