కృత్య పద్ధతి ద్వారా సులభం
మహేశ్వరం: ప్రయోగపూర్వకంగా వివరించి చెబితే గణితం విద్యార్థులకు సులభంగా అర్థమవుతుంది. చదవడం, సాధన చేయడం కంటే కృత్య పద్ధతిలో ముందుకెళ్తే మరింత సులభం. గణిత సూత్రాలను సులువుగా అర్థం చేసుకోవడానికి ప్రయోగాలు ఉపయోగపడుతాయి. విజువల్స్, మోడల్స్, చార్ట్‌ల ద్వారా బోధిస్తే తొందరగా అర్థమవుతుంది. సబ్జెక్టుపై మరింత ఆసక్తి పెరుగుతుంది. చార్ట్స్, త్రీడీ మోడల్స్, గ్రాఫ్ షీట్స్, జామెట్రీ బాక్స్‌లోని పరికరాలను ఉపయోగించి నేర్తిస్తాం. రేఖా గణితం, బీజగణితం, క్షేత్రమితి, త్రికోణమితి, సంఖ్యాక శాస్త్రానికి సంబంధించి బోధనోపరికరాలతో బోధిస్తే సులభంగా అర్థమవుతుంది.
– పి.మధుసూదన్‌రెడ్డి, గణితశాస్త్ర ఉపాధ్యాయుడు, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, జెడ్పీహెచ్‌ఎస్ పెండ్యాల
Comments
Please login to add a commentAdd a comment