ఇళ్ల మధ్య మురుగునీరు
అంతర్జాతీయ గుర్తింపు పొందిన శంషాబాద్ మున్సిపాలిటీలో మురుగునీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఇప్పటికీ మెజార్టీ కాలనీల్లో డ్రైనేజీ కాల్వలు లేవు. దీంతో ఇళ్ల మధ్య నుంచే మురుగు నీరు ప్రవహిస్తోంది. ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో కళకళలాడిన ఫిరంగినాలా ప్రస్తుతం పూర్తిగా ఆనవాళ్లు కోల్పోయింది. మురికి కూపంగా మారింది. డ్రైనేజీ కాల్వలను నిర్మించిక పోవడంతో ఇళ్ల నుంచి వెలువడిన నీరు ఇందులో చేరి దోమలు, ఈగలు, పందులకు నిలయంగా మారింది.
– మంచర్ల శ్రీనివాస్, శంషాబాద్
Comments
Please login to add a commentAdd a comment