ఆటో బోల్తా, ఒకరు మృతి
కొందుర్గు: ఆటో బోల్తాపడిన సంఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో పన్నెండు మంది గాయపడ్డారు. ఈ సంఘటన గురువారం జిల్లేడ్ చౌదరిగూడ మండలం తూంపల్లి చౌరస్తా వద్ద చోటుచేసుకుంది. ఎస్‌ఐ విజయ్ తెలిపిన వివరాల ప్రకారం.. లాల్‌పహాడ్ వైపు నుంచి చౌదరిగూడ వెళ్తున్న ఆటో (ఏపీ 22 ఎక్స్ 0318) డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త వలన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న తుమ్మలపల్లి గ్రామానికి చెందిన బంగారు జంగయ్య(70) మృతిచెందాడు. మిగతా పన్నెండు మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకొని చికిత్స నిమిత్తం క్షతగాత్రులను, పోస్టుమార్టం కోసం జంగయ్య మృతదేహాన్ని 108 వాహనాల్లో షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
పన్నెండు మందికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment