మంచాల: పశువుల పాకలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నారెడ్డి గూడ గ్రామా నికి చెందిన కావలి ప్రవీణ్(22) కడుపునొప్పి భరించలేక గురువారం వారి వ్యవసాయ బావి వద్ద పశువుల పాకలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు.
కొత్తూరులో మహిళ..
కొత్తూరు: కడుపునొప్పితో ఓ మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం మండలం కల్వకోలు గ్రామానికి చెందిన చిర్ర కల్పన(26)కు కొత్తూరు మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన యాదయ్యతో ఆరేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి 5, 4 ఏళ్ల వయసున్న కుమారుడు, కుమార్తె ఉన్నారు. స్థానికంగా వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొంత కాలంగా కల్పన తీవ్రమైన కడుపునొప్పితో బాధ పడుతుండేది. ఈ క్రమంలో నొప్పి భరించలేక డిసెంబర్ 31న పొలం వద్ద పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమి త్తం ఉస్మానియ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈ నెల 1న ఆమె మృతి చెందింది. మృతురాలి తండ్రి శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment