‘ఫ్యూచర్’ రహదారిపై రైతులతో సమావేశం
కందుకూరు: ఫ్యూచర్ సిటీ రహదారి నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న మండల పరిధిలోని తిమ్మాపూర్ రైతులతో శనివారం రెవెన్యూ అధికారులు సమావేశం నిర్వహించారు. భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ జీవీ రాజు, తహసీల్దార్ గోపాల్ ఆధ్వర్యంలో రైతులతో పరిహారం విషయమై చర్చించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ కోసం వంద మీటర్ల రహదారి నిర్మాణానికి తమ భూములు ఇవ్వాలని, భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఉంటుందని తెలిపారు. తమ భూములకు బహిరంగ మార్కెట్‌లో రూ.4 కోట్లు ధర పలుకుతోందని, ఆ ప్రకారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల అభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అధికారులు వారికి తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఐ యాదగిరి, మాజీ సర్పంచ్ గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
వేసవి శిబిరాల పోస్టర్ల ఆవిష్కరణ
ఆమనగల్లు: వందేమాతరం ఫౌండేషన్, శృతిలయ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించే వేసవి ఉచిత శిక్షణ శిబిరాల పోస్టర్లను త్రిదండి చిన్నజీయర్‌స్వామి ఆవిష్కరించారు. ముచ్చింతల క్షేత్రంలో శనివారం జరిగిన కార్య క్రమంలో వీటిని ఆవిష్కరించారు. కార్యక్రమంలో శృతిలయ కల్చరల్ అకాడమీ వ్యవస్థాప కుడు దార్ల చిత్తరంజన్‌దాస్, ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్, జోనల్ ఇన్‌చార్జిలు శ్రీరాం, జంగయ్య, రాజేశ్, ఆదిత్య పాల్గొన్నారు.
వీఎం హోంలో షూటింగ్.. నిర్వాహకులపై ఫిర్యాదు
హుడాకాంప్లెక్స్: పాఠశాల పని దినాల్లో సినిమా షూటింగ్‌లకు అనుమతి ఇచ్చి విద్యార్థుల హక్కులకు భంగం కలిగించిన వీఎంహోం కార్యదర్శి కె.కిషన్, సూపరింటెండెంట్ ఈ.లక్ష్మీపార్వతి, ప్రిన్సిపాల్ భాస్కర్‌ను సస్పెండ్ చేయాలని వీఎంహోం పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు బి.మహేశ్‌గౌడ్ డిమాండ్ చేశారు. అక్రమ సంపాదన కోసం విద్యార్థుల చదువులను పణంగా పెట్టడం, బాలల హక్కులకు భంగం కలిగించిన విషయంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్, బాలల హక్కుల కమిషన్‌తో పాటు షెడ్యూల్ కులాల అభివృద్ధి సంస్థ డైరెక్టర్, సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వకంగా శనివారం ఫిర్యాదు చేశారు. వీఎంహోంలో సిబ్బంది నియామకం, కొనుగోలు టెండర్లలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం సహాయ కార్యదర్శి సాగర్, ఉపాధ్యక్షుడు రాజు, నాయకులు భాస్కర్, వినయ్, విఠల్, గణేష్, వినయ్‌కుమార్ పాల్గొన్నారు.
సింగపూర్ సదస్సుకు మొగిలిగిద్ద వాసికి ఆహ్వానం
షాద్‌నగర్‌రూరల్: సింగపూర్ యూనివర్సిటీలో నిర్వహించే అంతర్జాతీయ సదస్సుకు మండల పరిధిలోని మొగిలిగిద్ద నివాసి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్‌రెడ్డికి ఆహ్వానం లభించింది. సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఇండియా భాగస్వామ్యంలో ఫిబ్రవరి మొదటి వారంలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో ‘అర్బన్ డెవలప్‌మెంట్ స్ట్రాటజీ క్‌లైమేట్ మిటిగేషన్’ అంశంపై రాసిన పరిశోధన పత్రాన్ని డాక్టర్ రవీందర్‌రెడ్డి ప్రజెంట్ చేయనున్నారు. సదస్సుకు ఎంపికై న డాక్టర్ రవీందర్‌రెడ్డిని శనివారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సన్మానించా రు. ప్రొఫెసర్ హరగోపాల్ అభినందించారు. ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని, విజ్ఞానాన్ని పెంపొందించుకొని నవభారత నిర్మాతలుగా ఎదగాలని ఆకాంక్షించారు. భార తదేశం ప్రస్తుతం వాతావరణంలో మార్పును ప్రధాన సమస్యగా ఎదుర్కొంటోందని, ఈ సమస్యను అధిగమించి అభివృద్ధి చెందే విధంగా ప్రజెంటేషన్ చేయబోతున్నందుకు ఆనందంగా ఉందని డాక్టర్ రవీందర్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment