తెల్ల కుసుమ సాగుతో అధిక దిగుబడి
షాబాద్: తెల్ల కుసుమ సాగుతో రైతులు అధిక దిగుబడి సాధించవచ్చని భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్కే మాథుర్, ఐసీఏఆర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ న్యూఢిల్లీ డాక్టర్ ఎస్‌కే జా పేర్కొన్నారు. మండల పరిధిలోని రేగడిదోస్వాడ గ్రామంలో శనివారం భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ రాజేంద్రనగర్ వారి సేవా స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చర్చాగోష్టి నిర్వహించారు. తిర్మలాపూర్, రేగడిదోస్వాడ గ్రామాల్లో రైతులు సాగు చేసిన కుసుమ పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డ్రోన్ ద్వారా మందుల పిచికారీ విధానాన్ని రైతులకు వివరించారు. శాస్త్రవేత్తలు ప్రసాద్, శ్రీనివాస్, సతీష్‌కుమార్, అలివేలు, శారద కుసుమ పంటలో తెగుళ్ల నివారణ, బయోపాలిమర్ టెక్నాలజీ, సస్యరక్షణ పద్ధతు లను వివరించారు. సేవా స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుగుణమాల రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేసి రైతులకు అందిస్తున్న సేవలను ప్రాజెక్ట్ మేనేజర్ రత్నాకర్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment