ఆ భూములకే రైతుభరోసా
ఆమనగల్లు: సాగుకు యోగ్యమయ్యే భూములన్నింటికీ రైతుభరోసా అందుతుందని జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు తెలిపారు. ప్రభుత్వం రైతుభరోసా పథకం అమలులో భాగంగా చేపట్టిన సాగుకు యోగ్యంలేని భూముల గుర్తింపు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఆమనగల్లు, కడ్తాల్ మండలాల్లో శనివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా సర్వే నిర్వహణపై రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం నర్సింహారావు మాట్లాడుతూ.. సాగుకు యోగ్యమైన భూములకు రైతుభరోసా అందిస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం అర్హులందరికీ రైతుభరోసా అందించడానికి సర్వే చేపట్టిందని చెప్పారు. ఈ నెల 20 నుంచి నిర్వహించే గ్రామ, వార్డు సభల్లో సాగుకు యోగ్యంలేని భూముల వివరాలు ప్రదర్శించాలని, అభ్యంతరాలు ఉంటే స్వీకరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆమనగల్లు ఏడీఏ ఆదిలక్ష్మి, ఆమనగల్లు తహసీల్దార్ లలిత, కడ్తల్ తహసీల్దార్ ముంతాజ్, ఆమనగల్లు, కడ్తాల్ వ్యవసాయాధికారులు శ్రీనివాస్‌గౌడ్, శ్రీలత, ఆర్‌ఐ చెన్నకేశవులు, ఏఈఓ నిఖిత తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు
Comments
Please login to add a commentAdd a comment