గ్రూప్‌–3 పరీక్షలకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–3 పరీక్షలకు ఏర్పాట్లు

Published Sat, Oct 19 2024 7:18 AM | Last Updated on Sat, Oct 19 2024 7:18 AM

గ్రూప్‌–3 పరీక్షలకు ఏర్పాట్లు

దరఖాస్తుల ప్రక్రియ

వేగవంతం చేయాలి

ల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్‌ క్రాంతి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించి, దరఖాస్తులు పరిష్కరించాలని కోరారు. సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

17వేల మంది అభ్యర్థులు..49 పరీక్ష కేంద్రాలు

అవసరమైతే అన్ని శాఖల సహకారం: కలెక్టర్‌

సంగారెడ్డి జోన్‌: జిల్లాలో గ్రూప్‌– 3 పరీక్షలకు 17వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని జిల్లా కలెక్టర్‌ వల్లూరు క్రాంతి తెలిపారు. మొత్తం 49 పరీక్ష కేంద్రాలను గుర్తించామన్నారు. శుక్రవారం రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ మహేందర్‌ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌ కార్యాలయం నుంచి అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌ కలసి ఆమె హాజరయ్యారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ఇప్పటికే అధికారులు ఈ కేంద్రాలను సందర్శించి వసతి సదుపాయాలను పరిశీలించినట్లు తెలిపారు. గ్రూప్‌–3 పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు, ఇతర మెటీరియల్‌ను కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య భద్రపరిచేందుకు రెండు స్ట్రాంగ్‌ రూమ్‌లను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమిస్తామని, అవసరమైతే ఇతర శాఖల సహకారం తీసుకుంటామన్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని వివరించారు.

ఏటీసీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

యువతలో వృత్తి నైపుణ్యాలు పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పన, శిక్షణ ఆధ్వర్యంలో నూతనంగా నెలకొల్పిన అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ కేంద్రాల (ఏటీసీ)ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ క్రాంతి సూచించారు. శుక్రవారం ప్రభుత్వ ప్రిన్సిపల్‌ కార్యదర్శి సంజయ్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె హాజరయ్యారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఏటీసీ కేంద్రాలలో ప్రవేశాలు వేగవంతం అయ్యేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రాలలో శిక్షణ కొరకు ఏర్పాట్లు పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. తొలి విడతలో భాగంగా సంగారెడ్డి, హత్నూర ఐటీఐ కళాశాలను గుర్తించి ఏటీసీలుగా అప్‌ గ్రేడ్‌ చేశామన్నారు. ఈనెల 31 వరకు అర్హులైన, ఆసక్తిగల విద్యార్థులు ప్రవేశాలు పొంది సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement