అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
జహీరాబాద్ టౌన్/మునిపల్లి(అందోల్): అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో రంజోల్‌లో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను శుక్రవారం ఆమె పరిశీలించి ప్రజలతో మాట్లాడారు. సర్వే కార్యక్రమం చురుగ్గా కొనసాగుతుందని చెప్పారు. ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. సర్వేకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు.
నాణ్యత తగ్గితే కఠిన చర్యలు
విద్యార్థులకు పెట్టే భోజనంలో నాణ్యత తగ్గితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ క్రాంతి హెచ్చరించారు. మండలంలోని రంజోల్‌లోని బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో సమావేశమై వారి నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గురుకుల పరిసరాలు, స్టోర్ రూం, వంట సామగ్రిని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రామ్‌రెడ్డి, ప్రత్యేకాధికారి భిక్షపతి, ఎంపీడీవో మహేందర్‌రెడ్డి, తహసీల్దార్ రవీందర్ ఉన్నారు.
అంకిత భావంతో చదవాలి
పిల్లలు బాగా చదువుకునే విధంగా తల్లిదండ్రులు పోత్సహించాలని, ప్రతీ విద్యార్థి అంకితభావంతో చదవాలని కలెక్టర్ క్రాంతి సూచించారు. మునిపల్లి మండలంలోని కంకోల్ ప్రాథమిక, జడ్పీహెచ్‌ఎస్, ఉర్దూమీడియం పాఠశాలలను పరిశీలించారు. ప్రైమరీ పాఠశాలలో రూం టు రీడ్ సంస్థ ఏర్పాటు చేసిన గ్రంథాలయంను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..గ్రంథాలయంలోని పుస్తకాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగ పడుతాయన్నారు. కార్యక్రమంలో డీఈవో వెంకటేశ్వర్లు, మండల ప్రత్యేకాధికారి రామాచారి, తహసీల్దార్ ఆశాజ్యోతి, ఎంపీడీవో హరినందన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ వల్లూరు క్రాంతి
రంజోల్‌లో ఇళ్ల సర్వే పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment