శతశాతమే లక్ష్యం
న్యాల్‌కల్(జహీరాబాద్): నాణ్యమైన విద్యనంచేందుకు ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది. అందుకనుగుణంగా మంచి ఫలితాలను సాధించేందుకు అధికారులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మార్చి 21 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండటంతో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా పదో తరగతిలో శత శాతం ఫలితాలు సాధించేందుకు చర్యలు చేపట్టారు. గతేడాది పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం తగ్గి రాష్ట్రంలో జిల్లా ఐదవ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది జిల్లాను మొదటిస్థానంలో నిలిపేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అందులో భాగంగా పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల విషయంలో వారి తల్లిదండ్రులతో మాట్లాడి మంచి ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా అధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆదిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
గంటసేపు ప్రత్యేక తరగతులు...
నవంబర్ 2వ నుంచి రెగ్యులర్ తరగతులతోపాటు ప్రతీరోజు సాయంత్రం 4.15 నుంచి 5.15 గంటల వరకు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులను గ్రూప్‌లుగా విభజించి ఆయా గ్రూప్‌లకు ఒక్కో ఉపాధ్యాయుడు బాధ్యత వహిస్తున్నారు. విద్యార్థులకు అర్థమయ్యే విధానంలో బోధన చేయడం, రెగ్యులర్‌గా తరగతులకు హజరయ్యేలా చూడటం, పరీక్షల నిర్వహణపై అవగాహన కల్పిచండంలాంటివి చేస్తున్నారు. తరచుగా విద్యార్థులకు స్లిప్ టెస్టులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు అందులో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
టెన్త్ ఫలితాల్లో మొదటిస్థానంలో
నిలిపేందుకు ప్రణాళికలు
అధికారులు, ఉపాధ్యాయులు
ప్రత్యేక శ్రద్ధ
Comments
Please login to add a commentAdd a comment