కుట్రతోనే కేటీఆర్‌పై కేసులు
బీఆర్‌ఎస్ నేత రావుల శ్రీధర్‌రెడ్డి
సంగారెడ్డి: మాజీ మంత్రి కేటీ రామారావుపై రేవంత్‌రెడ్డి సర్కార్ కుట్రపూరితంగానే అక్రమ కేసులు పెట్టిందని బీఆర్‌ఎస్ నేత రావుల శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఫార్ములా ఈ రేసులో ఎలాంటి అవినీతి జరగలేదని తీసుకున్న వారే చెబితే ఇంకా అవినీతి ఎక్కడ జరిగిందో ప్రభుత్వానికే తెలియాలన్నారు. ఫార్ములా ఈ రేసుపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేస్తే ఎందుకు పెట్టడంలేదని దుయ్యబట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టాలని రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తుందన్నారు. ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకతతోనే ప్రజల దృష్టి మళ్లించాలని కాంగ్రెస్ సర్కార్ కేటీఆర్‌పై కేసులు పెట్టిందని మండిపడ్డారు. సమావేశంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, జైపాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఆర్ వెంకటేశ్వర్, కార్యదర్శి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment