అమిత్ షా వ్యాఖ్యలు అమానుషం
సంగారెడ్డి/పటాన్‌చెరుటౌన్: పార్లమెంట్‌లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించేలా కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అమానుషమని టీపీసీసీ కార్యదర్శి తోపాజి అనంతకిషన్ పేర్కొన్నారు. అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి కాంగ్రెస్ నేతలు శుక్రవారం అభిషేకం చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీపీసీసీ కార్యదర్శి తోపాజి అనంతకిషన్, యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కూన సంతోష్‌లు మాట్లాడుతూ...అంబేడ్కర్‌కు జరిగిన అవమానాన్ని అభిషేకంతో కడిగేశామన్నారు. అమిత్ షా ను వెంటనే పదవిలో నుంచి తొలగించాలని డి మాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు నాగరాజు,అమీర్ బేగ్, ప్రదీప్, నాయకులు రవినాథ్, నవాజ్, కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
షా వ్యాఖ్యలు దుర్మార్గం....
అంబేడ్కర్‌పై చేసిన కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి పేర్కొన్నారు. పటాన్‌చెరు పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...రాజ్యాంగాన్ని మార్చే పనిలో కేంద్రప్రభుత్వం ఉందని అందులోభాగంగానే అంబేడ్కర్‌పై హోం మంత్రి వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ టీపీసీసీ కార్యదర్శి మతిన్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అతిక్, కాంగ్రెస్ నాయకులు సాయిలు ముదిరాజ్, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.
టీపీసీసీ కార్యదర్శి తోపాజి అనంత కిషన్
సంగారెడ్డిలో అంబేడ్కర్ విగ్రహానికి
అభిషేకం
Comments
Please login to add a commentAdd a comment