వైజ్ఞానిక సభలు జయప్రదం చేయాలి
సదాశివపేట(సంగారెడ్డి): టీఎఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 28 నుంచి 30 వరకు నల్లగొండలో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఆరవ విద్య వైజ్ఞానిక మహాసభలు జయప్రదం చేయాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని న్యూగవర్నమెంట్ ఉన్నత పాఠశాలలో విద్యా వైజ్ఞానిక మహాసభల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలని, సీపీఎస్ విధానం రద్దు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ పాత పింఛను పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
టీఎస్‌యూటీఎఫ్
జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు
Comments
Please login to add a commentAdd a comment