వేర్వేరు చోట్ల ముగ్గురు ఆత్మహత్య
భార్యతో గొడవపడి భర్త
పటాన్‌చెరు టౌన్: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పటాన్ చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ కోటేశ్వరరావు కథనం మేరకు.. నిజాంపేటకు చెందిన దినేశ్ (27)కి ఏడాది కిందట పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని సాయిరామ్ కాలనీకి చెందిన నిఖితతో ప్రేమ వివాహం జరిగింది. దినేశ్ ఎలక్ట్రిషన్‌గా పని చేస్తున్నాడు. 13వ తేదీ రాత్రి భోజనం విషయంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. మరుసటి రోజు ఉదయం మరోసారి గొడవ జరగడంతో దినేశ్ భార్య ఇంట్లో ఉండగానే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సహకారంతో భార్య ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
జూదానికి బానిసై వ్యక్తి
ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ అభిమాన్ సింగ్ కథనం మేరకు.. పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామానికి చెందిన నాగరాజు (39) మద్యంతోపాటు జూదానికి బానిసై డబ్బులు ఇవ్వాలని ఇంట్లో భార్యతో గొడవ పడుతుండేవాడు. మంగళవారం రాత్రి భార్యని డబ్బులు అడుగగా ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది ఇంట్లోకి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య మనీలా బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆర్థిక సమస్యలతో వ్యక్తి
మనోహరాబాద్(తూప్రాన్): ఆర్థిక సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య చేసున్నా డు. ఎస్‌ఐ సుభాష్ గౌడ్ కథనం మేరకు.. మండలంలోని లింగారెడ్డిపేట్ గ్రామానికి చెందిన గుర్రం శ్రీనివాస్ (38) కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. కొద్దిరోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ మద్యం సేవిస్తూ ఇంట్లో భార్యతో గొడవ పడుతుండేవాడు. మూడు రోజుల కిందట భార్య రమ్య ఇద్దరు పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపం చెంది శ్రీనివాస్ మంగళవారం ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment