అత్యాచార ఘటనలో ముగ్గురు రిమాండ్
చేగుంట(తూప్రాన్): మాసాయిపేట మండలం రామంతాపూరలో ఇటీవల జరిగిన అత్యాచార ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు రామాయంపేట సీఐ వెంకట్‌రాజాగౌడ్ తెలిపారు. మంగళవారం చేగుంటలో విలేకరుల సమావేశంలో సీఐ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రామంతాపూర్ గ్రామానికి చెందిన భవాని స్వామి అనే రైతుకు చెందిన పాడి గేదెలు 8న లింగారెడ్డిపల్లి దారిలోని పశువుల పాక నుంచి అపహరణకు గురయ్యాయి. మరుసటి రోజు పోలీస్‌స్టేషన్‌లో బాధిత రైతు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా పశువుల ఆచూకీ కోసం దాబాలోని సీసీ ఫుటేజీని పరిశీలించగా అంబేడ్కర్ విగ్రహం సమీపంలో ముగ్గురు వ్యక్తులు మతిస్థిమితం లేని మహిళపై 8న రాత్రి లైంగిక దాడికి పాల్పడినట్లు రికార్డు అయ్యింది. ఈ విషయంలో గ్రామస్తుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టగా చేగుంట నుంచి కోళ్లను సరఫరా చేసే వ్యానుపై పని చేసే వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడినట్లు గుర్తించారు. వెంటనే విచారణ చేపట్టి లైంగిక దాడికి పాల్పడిన నిందితులు అఫ్రోజ్, సాహిల్, బసవరాజ్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరళించినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో చేగుంట ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డితోపాటు స్థానిక పోలీస్ సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment