ఘనంగా మల్లికార్జుస్వామి బ్రహ్మోత్సవాలు
హుస్నాబాద్‌రూరల్: పొట్లపల్లి శ్రీ మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం తెల్లవారు జామున అగ్ని గుండాలతో ఘనంగా ముగిశాయి. సోమవా రం శివకల్యాణంతో ప్రారంభమైన ఉత్సవాలు మంగళవారం బోనాలు, ఎడ్ల బండ్ల ప్రదక్షిణలు నిర్వహించారు. రాత్రి స్వామి వారికి భక్తులు బోనాలు సమర్పించారు. అలాగే పట్నాలు వేసే కార్యక్రమాలు నిర్వహించారు. పొట్లపల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి 202 ఏళ్ల చరిత్ర ఉండటంతో చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కలు సమర్పించారు. పిల్లజెల్ల బాగుండాలి, పాడి పంటలు సమృద్ధిగా అభివృద్ధి చెందాలని కోరుతూ బండ్లు, ట్రాక్టర్లతో ఆలయం చుట్టూ రైతు లు ప్రదక్షిణలు చేశారు. కోరిన కొర్కెలు తీర్చే దైవంగా భావించే మల్లికార్జునస్వామికి యువతి, యువ కులు బోనాలు, దీపాలతో ప్రదక్షిణలు చేశారు. స్వామి కటాక్షం కోసం భక్తులు అగ్ని గుండాలను దా టేందుకు ఉత్సాహం చూపించారు. ఉత్సవాల్లో ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ దేవసాని నిర్మల నర్సింహారెడ్డి, కానుగుల మోహన్, మార్క అనిల్ కుమార్, మార్క చంద్రయ్య, గడ్డం మల్లయ్య, జగదీశ్వర్, పాకాల శ్యాంసుందర్, కర్ర రవీందర్‌రెడ్డి, గాజుల చంద్రయ్య,తదితరులు పాల్గొన్నారు.
బోనాలతో తరలివచ్చిన భక్తులు
జోరుగా ఎడ్ల బండ్ల ప్రదక్షిణలు, అగ్నిగుండాలు
Comments
Please login to add a commentAdd a comment