గోల్డ్ కప్ విజేత నాగర్‌కర్నూల్
జహీరాబాద్ టౌన్: అంతర్రాష్టీయ కీజర్ యాఫై గోల్డ్ కప్‌ను డాలీ సీసీ నాగర్ కర్నూల్ జట్టు గెలుచుకుంది. పట్టణంలోని బాగారెడ్డి స్టేడియంలో పది రోజులపాటు జరిగిన అంతరాష్ట్రీయ గోల్డ్ కప్ మెగా క్రికెట్ టోర్నమెంట్‌కు దేశంలోని 16 జట్లు పాల్గొన్నాయి. డాలీ సీసీ నాగర్‌కర్నూల్, నేషనల్ కలీమ్ ఎలెవెన్ జట్లు ఫైనల్‌కు చేరాయి. హోరాహోరీగా జరిగి మ్యాచ్‌లో నాగర్‌కర్నూల్ జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన నాగర్ కర్నూల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అనంతరం నేషన్ కలీమ్ జట్టు 20 ఓవర్లలో 164 రన్స్ చేసి 3 పరుగుల తేడాతో ఓడిపోయింది. విజేత జట్టుకు గోల్డెన్ కప్‌తో పాటు రూ.6,11,111 లక్షల ప్రైజ్ మనీ అందజేశారు. రన్నరప్‌కు రూ. 3,55,555 లక్షల చెక్కును ఇచ్చారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీసీవై పార్టీ అధినేత రామచంద్రన్ యాదవ్, సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, మాజీ చైర్మన్ తన్వీర్, టోర్నీ నిర్వాహకులు ఖిజర్ యాపై, టోర్నమెంట్ పర్యవేక్షులు రాములునేత, సయ్యద్ మహబూబ్, విజయ్, అబ్దుల్లా, ఆదయ్ యాపై, అథిల్ యాపై తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment