పటాన్‌చెరు టౌన్: డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వాహ నదారులకు సంగారెడ్డి జిల్లా కోర్టు జరిమానా, జైలు విధించిన ఘటన పటాన్‌చెరు ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ట్రాఫిక్ సీఐ లాలూ నాయక్ కథనం మేరకు.. బుధవారం నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లో 39 మందిని పట్టుకున్నాం. వాహనదారులను గురువారం సంగారెడ్డి కోర్టులో హాజరు పర్చగా 16 మందికి రూ. 2 వేలు, మరో 21 మందికి రూ.1,500, ఒకరికి రూ.1,000 జరిమానా విధించినట్లు తెలిపారు. మరో వ్యక్తికి జరిమానా తోపాటు రెండు రోజులు జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు.
సంగారెడ్డిలో 17 మంది
సంగారెడ్డి క్త్రెమ్: సంగారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్, పోతిరెడ్డిపల్లి, చౌరస్తా, బైపాస్‌లోని గుర్రపు బొమ్మ వద్ద బుధవారం అర్థరాత్రి డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించగా పలువురు పట్టుబడినట్టు ట్రాఫిక్ సీఐ సుమన్ కుమార్ తెలిపారు. పట్టుబడిన 17 మంది వాహనదారులను గురువారం సంగారెడ్డి కోర్టులో హాజరుపర్చగా జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి షకీల్ అహ్మద్ సిద్దిఖీ ఐదుగురికి రూ.2,000 జరిమానా, మరో 12 మందికి రూ.1,500 జరిమానా విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు.
సిద్దిపేటలో 38 మంది
సిద్దిపేటజోన్: సిద్దిపేట పట్టణంలో, సరిహద్దుల్లో కొద్దిరోజులుగా పోలీసుల డ్రంకెన్ డ్రైవ్‌లో పెద్ద ఎత్తున మందుబాబులు చిక్కారు. వారిని గురువారం న్యాయస్థానంలో హాజరుపర్చగా ఒకరికి ఐదు రోజులు, మరొకరికి మూడు రోజుల జైలు శిక్ష, 36 మందికి రూ 74,500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట టూ టౌన్ సీఐ ఉపేందర్ ఆధ్వర్యంలో నర్సాపూర్ చౌరస్తా, ఎంపీడీఓ చౌరస్తా, వేములవాడ కమాన్, ఎల్లమ్మ దేవాలయం వద్ద డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించి పలువురిని పట్టుకున్నారు. వారిని గురువారం కోర్టులో హాజరుపర్చగా సిద్దిపేట సెకండ్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కాంతారావు 13 మందికి రూ.23,500 జరిమానా, ఒకరికి ఐదు రోజుల జైలు శిక్ష విధించినట్టు సీఐ పేర్కొన్నారు. అదే విధంగా ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో డ్రంకెన్ డ్రైవ్ చేపట్టగా 23 మంది మద్యం తాగి పట్టుబడ్డారు. వారిని న్యాయస్థానంలో హాజరుపర్చగా 23 మందికి రూ.56 వేలు జరిమానా, ఒకరికి మూడు రోజుల జైలు శిక్ష విధించినట్లు సీఐ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
ఒకరు జైలుకు
జిన్నారం (పటాన్‌చెరు): గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో వారం రోజులుగా డ్రంకై న్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఇందులో మద్యం తాగిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం సంగారెడ్డి కోర్టులో హాజరుపరుచగా న్యాయమూర్తి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్‌ఐ మహేశ్వర్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment