శభాష్ పోలీస్..
హుస్నాబాద్: చలికి వణుకుతూ, ఎండకు ఎండుతూ, ఆకలితో అలమటిస్తూ రోడ్డుపై దీనంగా పడి ఉన్న ఓ వృద్ధురాలిని స్వగ్రామానికి చేర్చి పోలీసులు శభాష్ అనిపించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. భీమదేవరపల్లి మండలం బొల్లొనిపల్లికి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు వడ్లకొండ కొమురవ్వకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హుస్నాబాద్ పట్టణంలో ఉంటున్న కుమారుడు అయిలయ్య మేసీ్త్ర పని చేస్తుంటాడు. కుమారుడు తనపై చేయి చేసుకున్నాడని అలిగి తల్లి బయటికొచ్చింది. హుస్నాబాద్ పట్టణంలోని గాంధీ చౌరస్తాకి చేరి మూడు రోజులుగా చలికి వణుకుతూ, ఎండకు ఎండుతూ కన్న కొడుకు కోసం రోదిస్తూ అవస్థలు పడుతుంది. తిండితిప్పలు లేక నీరసంగా పడి ఉన్న వృద్ధురాలిని చూసి స్థానికులు చలించిపోయి భోజనం అందించారు. ఇది గమనించిన స్థానిక కౌన్సిలర్ గూళ్ల రాజు విషయాన్ని పోలీస్‌లకు చెప్పాడు. హుటాహుటినా హెడ్ కానిస్టేబుల్ మొగిలి నాయక్, కానిస్టేబుల్ దూద్య నాయక్ వృద్ధురాలి వద్దకు వచ్చి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సొంత డబ్బులతో కొమురమ్మను స్వగ్రామ బొల్లొనిపల్లెకు ఆటోలో పంపించారు. ఆపదలో ఉన్న వృద్ధురాలిని ఆదుకున్న పోలీసులను అందరూ అభినందించారు.
మూడు రోజులుగా రోడ్డుపై వృద్ధురాలి అవస్థ
స్వగ్రామానికి చేర్చి మానవత్వాన్ని చాటుకున్న పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment