మెదక్‌మున్సిపాలిటీ: దుకాణంలోకి ప్రవేశించి మాబావతోపాటు అన్న కొడుకుపై దాడికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సిమెంట్ వ్యాపారి లింగమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. మెదక్ పట్టణంలోని సాయినగర్ కాలనికి చెందిన తోట లింగమూర్తికి స్థానిక వెల్‌కమ్ బోర్డు వద్ద సిమెంట్, స్టీల్ దుకాణం ఉంది. ఇదే కాలనీకి చెందిన నరేందర్‌రెడ్డికి లింగమూర్తికి మధ్య డబ్బుల విషయంలో ఇటీవల గొడవలు జరిగాయి. గురువారం మధ్యాహ్నం నరేందర్ రెడ్డి 40 మందితో వచ్చి దుకాణంలో కూర్చున్న అంతోల్ల వెంకటేశం, తోట అఖిల్ ముఖేష్‌లపై దాడి చేసినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ నాగరాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment