డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వాహనదారులు
పటాన్‌చెరు టౌన్: డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వాహనదారులకు సంగారెడ్డి జిల్లా కోర్టు జరిమానా, జైలు శిక్ష విధించిన ఘటన పటాన్‌చెరు ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ట్రాఫిక్ సీఐ లాలూ నాయక్ కథనం మేరకు.. గురువారం నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లో 13 మందిని పట్టుకున్నాం వీరిని శుక్రవారం సంగారెడ్డి కోర్టులో హాజరుపర్చగా ఏడుగురికి రూ.2 వేలు జరిమానా, మరో ఐదుగురికి రూ.1,500 , మరో వ్యక్తికి జరిమానాతోపాటు రెండు రోజులు జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు.
సంగారెడ్డి క్త్రెమ్: డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వాహన దారులకు కోర్టు జైలు శిక్షతోపాటు జరిమానా విధించినట్లు సంగారెడ్డి ట్రాఫిక్ సీఐ సుమాన్ కుమార్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. పట్టణంలో గురువారం అర్థరాత్రి పోతిరెడ్డిపల్లి చౌరస్తా, పాత బస్టాండ్ వద్ద డ్రంకెన్ డ్రెవ్ నిర్వహించగా 10 మంది పట్టుపడ్డారు. శుక్రవారం జిల్లా న్యాయస్థానంలో హజరుపర్చగా జిల్లా అదనపు న్యాయమూర్తి షకిల్ అహ్మద్ సిద్దిఖీ ఒకరికి మూడు రోజులు జైలు, మరొకరికి రెండు రోజులు జైలు శిక్ష విధించారు. అలాగే మరో వ్యక్తికి ఒక్క రోజు జైలు, మిగితా ఆరుగురికి రూ.1,500 జరిమానా, ఇంకో వ్యక్తికి రూ.1,000 జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment