అగ్ని ప్రమాదంలో కాలిపోయిన డబ్బులు
సుమారు రూ.2 లక్షల వరకు నష్టం
నారాయణఖేడ్: ఖేడ్ మండలం పంచగామలో శుక్రవారం తెల్లవారుజామున విద్యుదాఘాతంతో కిరాణాదుకాణం దగ్ధమై రూ.2 లక్షల నష్టం వాటిల్లింది. బాధితుడి కథనం మేరకు.. గ్రామానికి చెందిన తెనుగు శంకర్ గ్రామంలోని ఇంటి వద్ద షెడ్డు ఏర్పాటు చేసుకొని కిరాణా దుకాణం నడుపుతున్నాడు. తెల్లవారు జామున షెడ్‌లోంచి మంటలు రావడాన్ని గుర్తించిన కుటుంబీకులు షెడ్డు తెరిచి మంటలార్పే ప్రయత్నం చేసినా ఆ లోపే జరగాల్సిన నష్టం జరిగింది. రూ.50 వేల విలువ చేసే కిరాణా సామగ్రి, ఫ్రిజ్, రూ.లక్ష నగదుతోపాటు, డ్వాక్రా గ్రూపు లీడర్ అయిన శంకర్ తల్లి బ్యాంకులో రుణ వాయిదా చెల్లించడానికి సభ్యుల వద్ద వసూలు చేసిన రూ.50 వేలు కాలి బూడదయ్యాయి. మొత్తం రూ.2 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.
Comments
Please login to add a commentAdd a comment