కన్న కొడుకును చంపిన తండ్రి
మనోహరాబాద్(తూప్రాన్): మద్యానికి బానిసై వేధింపులకు గురి చేస్తున్నాడని కన్న కొడుకునే తండ్రి హత్య చేశాడు. ఈ ఘటన మనోహరాబాద్ మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని లింగారెడ్డిపేట్ గ్రామానికి చెందిన మాదాసు దుర్గయ్య, ప్రమీల దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం కాగా కుమారులకు కాలేదు. దుర్గయ్య బట్టలు కుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పెద్ద కుమారుడు ఓ ప్రైవేట్ పరిశ్రమలో పని చేస్తున్నాడు. చిన్న కుమారుడు మాదాసు శ్రీకాంత్ (29) డ్రైవింగ్ చేస్తుండేవాడు. శ్రీకాంత్ మద్యానికి బానిసై నిత్యం ఇంట్లో తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తుండేవాడు. రెండు రోజుల కిందట గొడవలు జరిగి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా శ్రీకాంత్‌కు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. కానీ తనలో మార్పు రాలేదు. గురువారం రాత్రి సైతం తాగి తల్లిదండ్రులను చంపుతానని ఇంట్లో గొడవ చేశాడు. దీంతో విసుగు చెందిన తండ్రి దుర్గయ్య శ్రీకాంత్ నిద్రపోగానే కత్తితో విచక్షణారహితంగా నరిగి చంపేశాడు. శుక్రవారం వేకువజామునే దుర్గయ్య మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. తూప్రాన్ సీఐ రంగాకృష్ణ, మనోహరాబాద్ ఎస్‌ఐ సుభాష్‌గౌడ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి తల్లి ప్రమీలా ఫిర్యాదు మేరకు దుర్గయ్యను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రంగాకృష్ణ తెలిపారు.
మద్యానికి బానిసై వేధిస్తున్నాడని కత్తితో నరికి హత్య
అనంతరం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు
మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట్ గ్రామంలో ఘటన
Comments
Please login to add a commentAdd a comment