గర్భం దాల్చడంతో హత్నూర మండలంలో ఆలస్యంగా వెలుగులోకి
హత్నూర(సంగారెడ్డి): అభం శుభం తెలియని మతిస్థిమితం లేని బాలిక గర్భం దాల్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం మేరకు..హత్నూర మండలం కాసాల గ్రామానికి చెందిన ఓ బాలిక 9వ తరగతి చదివి ఇంటి వద్దే ఉంటుంది. తల్లిదండ్రులు మేసీ్త్ర పని కోసం కూలి పనులకు వెళ్లగా కొందరు వ్యక్తులు ఆమైపె అత్యాచారానికి పాల్పడటంతో గర్భం దాల్చింది. ఈ విషయమై ఇటీవల గ్రామంలో పంచాయితీ పెట్టారు. ఎవరు చేశారనేది తెలియదని, దుండగులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ విషయమై ఎస్సై సుభాష్‌ను ఫోన్ ద్వారా సంప్రదించగా తమ దృష్టికి రాలేదన్నారు.
వైద్యం అందిస్తున్నాం: జిల్లా వైద్యాధికారి గాయత్రీ దేవి
బాలిక 5 నుంచి 6 నెలల గర్భిణిగా ఉంది. ఆమెకు వైద్య సేవలు అందిస్తున్నాం. బాలిక గర్భం దాల్చిన విషయం జిల్లా శిశు సంక్షేమ అధికారి దృష్టికి సైతం తీసుకెళ్లి సమాచారం ఇచ్చాం. వైద్య సేవలు మాత్రమే మేము అందిస్తాం. పూర్తిస్థాయి విచారణ జిల్లా శిశు సంక్షేమ అధికారులు చేపట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment