KKR Vs SRH: Abhishek Sharmas Blissful Cameo Helps SRH Accelerate Score Board - Sakshi
Sakshi News home page

IPL 2023 KKR Vs SRH: సన్‌రైజర్స్‌కు ఇప్పటికి జ్ఞానోదయం అయింది.. వచ్చిన వెంటనే దుమ్మురేపాడు!

Published Sat, Apr 15 2023 9:27 AM | Last Updated on Sat, Apr 15 2023 11:00 AM

Abhishek Sharmas blissful cameo helps SRH accelerate score board - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌-2023లో సర్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తిరిగి గాడిలో పడింది. ఈ ఏడాది సీజన్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన ఆరెంజ్‌ ఆర్మీ.. 23 పరుగుల తేడాతో విజయ సాధించింది. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓపెనర్‌ ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింట విజయం సాధించిన సన్‌రైజర్స్‌ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుంది.

ఎట్టకేలకు జ్ఞానోదయం
ఇక సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మెనెజ్‌మెంట్‌కు ఎట్టకేలకు జ్ణానోదయం అయింది. తొలి మ్యాచ్‌లో విఫలమయ్యాడని స్టార్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మను ఎస్‌ఆర్‌హెచ్‌ పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఎస్‌ఆర్‌హెచ్‌ మెనెజ్‌మెంట్‌పై తీవ్ర విమర్శలు వెల్లవెత్తాయి. గతేడాది సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ తరపున టాప్‌ రన్‌ స్కోరర్ అయిన అభిషేక్‌ను పక్కన పెట్టడం సరికాదని పలువురు మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయపడ్డారు.

ఈ క్రమంలో కేకేఆర్‌తో మ్యాచ్‌కు అభిషేక్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ తిరిగి తీసుకువచ్చింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా అభిషేక్‌ శర్మకు అవకాశం రాలేదు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అభిషేక్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 17 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అతడు 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 పరుగులు చేశాడు. సన్‌రైజర్స్‌ 228 పరుగుల భారీ స్కోర్‌ చేయడంలో అభిషేక్‌ తన వంతు పాత్ర పోషించాడు.
చదవండి: IPL 2023: ఆ విషయం నాకు ముందే తెలుసు.. అతడు అద్భుతం! అందుకే అన్ని ఛాన్స్‌లు: మార్‌క్రమ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement