భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు సమయం దగ్గరపడుతున్న కొద్ది అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఆసియాకప్-2023 టోర్నీలో భాగంగా శనివారం క్యాండీలోని పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో దాయుదుల పోరు జరగనుంది. ఈ హై-వోల్టేజ్ ఎన్‌కౌంటర్‌కు ముందు భారత ప్లేయింగ్ ఎలెవన్‌ను టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఎంచుకున్నాడు.
పల్లెకెలె మైదానం పరిస్థితులను బట్టి జట్టును ఎంపిక చేసినట్లు ఇర్ఫాన్ పఠాన్ ట్విటర్‌లో పేర్కొన్నాడు. తన ఎంచుకున్న జట్టులో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మకు చోటు దక్కలేదు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్‌కు ఇర్ఫాన్ అవకాశం ఇచ్చాడు.
అందరిని ఆశ్చర్యపరుస్తూ మూడో స్ధానంలో కోహ్లిని కాదని వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు పఠాన్ చోటిచ్చాడు. ఇక కోహ్లికి నాలుగో స్ధానంలో, రీ ఎంట్రీ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌కు ఐదో స్ధానంలో ఛాన్స్ దక్కింది.
అదే విధంగా ఆల్‌రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, జడేజా ఉన్నారు. కుల్దీప్ యాదవ్‌ను స్పెషలిస్టు స్పిన్నర్‌గా పఠాన్ ఎంపిక చేశాడు. ఆఖరిగా ఫాస్ట్ బౌలర్లగా మహ్మద్ షమీ, సిరాజ్, బుమ్రాను ఇర్ఫాన్ పఠాన్ ఎంపిక చేశాడు.
పాక్‌తో మ్యాచ్‌కు పఠాన్ ఎంపిక చేసిన జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్ ), శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్,విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.
చదవండి: IND vs PAK: భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం చేస్తారో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment