విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో కీలకమైన 34 పరుగులతో అజేయంగా నిలిచి టీమిండియాను విజయతీరాలకు చేర్చిన మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, తాజాగా జరిగిన ఓ వర్చువల్ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను బ్యాటింగ్ ఆర్డర్‌లో ఏ స్థానంలోనైనా ఆడేందుకు రెడీ అని, జట్టుకు అవసరమైతే బౌలింగ్ కూడా చేసేస్తానని కీలక కామెంట్స్ చేశాడు. తన దృష్టిలో ఏ స్థానంలో బ్యాటింగ్ చేశామన్నది ముఖ్యం కాదని, ఎన్ని పరుగులు చేశామన్నది.. జట్టుకు ఉపయోగపడ్డామా లేదా అన్నదే ముఖ్యమని సినిమా స్టైల్‌లో డైలాగులు వదిలాడు.
పరిమిత ఓవర్ల క్రికెట్‌తో పోలిస్తే.. టెస్ట్ క్రికెట్ ఆడటమే తనకు ఇష్టమని తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఈ సందర్భంగా ఓ విలేకరి అతన్ని ఆసీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ మైఖేల్ బెవాన్‌తో పోల్చగా.. నన్ను నన్నులా ఉండనివ్వండని, పట్టుమని 10 మ్యాచ్‌లు కూడా ఆడని నన్ను వన్డేల్లో బెస్ట్ యావరేజ్(232 మ్యాచ్‌ల్లో 53.6 సగటు) కలిగిన ఆటగాడితో పోల్చడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డాడు.
కాగా, టీమిండియా తరఫున 5 వన్డేలు ఆడిన సూర్యకుమార్.. 65.7 సగటున ఓ హాఫ్ సెంచరీ సాయంతో 197 పరుగులు, 11 టీ20ల్లో 3 హాఫ్ సెంచరీలతో 244 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 5000కు పైగా పరుగులు చేసిన అతను.. బౌలింగ్‌లో 24 వికెట్లు కూడా తీశాడు. అలాగే సూర్య తన 115 మ్యాచ్‌ల ఐపీఎల్ కెరీర్‌లో 135.6 స్ట్రయిక్‌రేట్‌తో 2341 పరుగలు చేశాడు. ఇందులో 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఆదివారం విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో 36 బంతుల్లో 34 పరుగులు చేసిన సూర్యకుమార్.. వరుసగా నాలుగు వన్డేల్లో 30కి పైగా పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.
చదవండి: కోవిడ్ నుంచి కోలుకున్న టీమిండియా ఆటగాళ్లు.. రెండో వన్డేకు అతడు దూరమేనా..!
Comments
Please login to add a commentAdd a comment