IBSA World Games 2023: భారత్‌కు సిల్వర్‌ మెడల్‌ | India Men's Blind Cricket Team Wins Silver Medal - Sakshi
Sakshi News home page

IBSA World Games 2023: భారత్‌కు సిల్వర్‌ మెడల్‌

Published Sun, Aug 27 2023 7:45 AM | Last Updated on Sun, Aug 27 2023 10:57 AM

India mens blind cricket team wins silver medal - Sakshi

తొలి బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (IBSA) వరల్డ్ గేమ్స్‌ ఫైనల్లో భారత పురుషుల అందుల క్రికెట్‌ జట్టుకు నిరాశ ఎదురైంది.  మెగా ఈవెంట్‌లో భాగంగా శనివారం పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో రజత పతకాన్ని భారత్‌ తమ ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా..  నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 184 పరుగులు సాధించింది.

భారత ఇన్నింగ్స్‌లో డాక్టర్ టోంపాకీ(76) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. సల్మాన్‌(48 నాటౌట్‌) మునీర్‌(41 నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్‌లతో పాక్‌ను ఛాంపియన్‌గా నిలిపారు. కాగా భారత బౌలర్లు ఎక్స్‌ట్రాస్‌ రూపంలో ఏకంగా 42 ఇవ్వడం గమానార్హం.

ఇక అంతకుముందు భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు మాత్రం చరిత్ర సృష్టించింది. ఫైనల్లో టీమిండియా..  ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి విశ్వవిజేతగా అవతరించింది. తద్వారా గోల్డ్‌మెడల్‌ను తమ ఖాతాలో భారత్‌ వేసుకుంది. దీంతో ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (IBSA) వరల్డ్ గేమ్స్‌ తొలి ఛాంపియన్‌గా టీమిండియా రికార్డులకెక్కింది.
చదవండి: మూడో వన్డేలోను పాకిస్తాన్‌దే విజయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement