IPL 2024 CSK vs MI Live Updates:
వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులకే పరిమితమైంది. ముంబై స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆజేయ శతకంతో చెలరేగినప్పటికి తన జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు.
63 బంతుల్లో హిట్‌మ్యాన్.. 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 103 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సీఎస్‌కే బౌలర్లలో పతిరాన అద్బుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. తన 4 ఓవర్ల కోటాలో 28 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. సీఎస్‌కే బ్యాటర్లలో శివమ్ దూబే(66 నాటౌట్), రుతురాజ్ గైక్వాడ్(69) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
ఆఖరిలో ఎంఎస్ ధోని మెరుపులు మెరిపించాడు. కేవలం 4 బంతుల్లో 3 సిక్స్‌ల సాయంతో 20 పరుగులు చేశాడు.
రోహిత్ శర్మ సెంచరీ..
రోహిత్ శర్మ సెంచరీతో మెరిశాడు. 62 బంతుల్లో రోహిత్ 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో తన సెంచరీ మార్క్‌ను పూర్తి చేసుకున్నాడు.
ముంబై ఐదో వికెట్ డౌన్.. డేవిడ్ ఔట్
టిమ్ డేవిడ్(13) రూపంలో ముంబై ఇండియన్స్ ఐదో వికెట్ కోల్పోయింది. ముంబై విజయానికి 18 బంతుల్లో 53 పరుగులు కావాలి. క్రీజులో రోహిత్ శర్మ(83) పరుగులతో ఉన్నాడు.
ముంబై నాలుగో వికెట్ డౌన్.. హార్దిక్ ఔట్
హార్దిక్ పాండ్యా రూపంలో ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. కేవలం రెండు పరుగులు మాత్రమే చేసిన హార్దిక్ పాండ్యా.. దేశ్‌పాండే బౌలింగ్‌లో ఔటయ్యాడు. ముంబై విజయానికి 27 బంతుల్లో 73 పరుగులు కావాలి.
ముంబై మూడో వికెట్ డౌన్
130 పరుగుల వద్ద ముంబై మూడో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన తిలక్ వర్మ.. పతిరాన బౌలింగ్‌లో ఔటయ్యాడు.క్రీజులోకి రోహిత్ శర్మ(76) పరుగులతో ఉన్నాడు. ముంబై విజయానికి ఆఖరి 6 ఓవర్లలో 77 పరుగులు కావాలి.
రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ..
ముంబై స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 31 బంతుల్లో హిట్‌మ్యాన్ హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 52 పరుగులతో రోహిత్ బ్యాటింగ్ చేస్తున్నాడు.
పతిరానా ఆన్ ఫైర్.. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు
సీఎస్‌కే పేసర్ పతిరానా దెబ్బకు ముంబై వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. 8వ ఓవర్ వేసిన పతిరాన బౌలింగ్‌లో తొలుత కిషన్ ఔట్ కాగా.. అనంతరం సూర్యకుమార్ యాదవ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. 8 ఓవర్లకు ముంబై స్కోర్: 75/2
తొలి వికెట్ డౌన్..
ఇషాన్ కిషన్ రూపంలో ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన కిషన్.. మతీషా పతిరానా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి ఇంపాక్ట్ ప్లేయర్‌గా సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు.
దంచి కొడుతున్న ముంబై ఓపెనర్లు.. 6 ఓవర్లకు స్కోర్: 63/0
ముంబై ఇండియన్స్ ఓపెనర్లు రోహిత్ శర్మ(42), ఇషాన్ కిషన్(21) అదరగొడుతున్నారు. 6 ఓవర్లు ముగిసే సరికి ముంబై వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది.
3 ఓవర్లకు ముంబై స్కోర్: 25/0
3 ఓవర్ల ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(19), ఇషాన్ కిషన్(6) పరుగులతో ఉన్నారు.
చెలరేగిన గైక్వాడ్, దూబే: ముంబై టార్గెట్ 207
టాస్ ఓడి బ్యాటింగ్‌కు తొలుత బ్యాటింగ్ దిగిన చెన్నై అదరగొట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో సీఎస్‌కే 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. సీఎస్‌కే బ్యాటర్లలో శివమ్ దూబే(66 నాటౌట్), రుతురాజ్ గైక్వాడ్(69) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
ఆఖరిలో ఎంఎస్ ధోని మెరుపులు మెరిపించాడు. కేవలం 4 బంతుల్లో 3 సిక్స్‌ల సాయంతో 20 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు, కోయిట్జీ, శ్రేయస్ గోపాల్ తలా వికెట్ సాధించారు.
మూడో వికెట్ డౌన్..
150 పరుగుల వద్ద సీఎస్‌కే మూడో వికెట్ కోల్పోయింది. 69 పరుగులు చేసిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు.
12 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 102/2
12 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే రెండు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ గైక్వాడ్(46), శివమ్ దూబే(27) పరుగులతో ఉన్నారు.
రెండో వికెట్ డౌన్.. రవీంద్ర ఔట్
61 పరుగుల వద్ద సీఎస్‌కే రెండో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన రచిన్ రవీంద్ర.. శ్రేయస్ గోపాల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి శివమ్ దూబే వచ్చాడు. 9 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 65/2
దంచి కొడుతున్న రుతురాజ్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే 5 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(24), రచిన్ రవీంద్ర(7) పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన సీఎస్‌కే.. రహానే ఔట్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే తొలి వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన అజింక్య రహానే..కోయిట్జీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వచ్చాడు.
ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. సీఎస్‌కే ఒక మార్పు చేసింది. మతీషా పతిరానా తుది జట్టులోకి వచ్చాడు.
తుది జట్లు
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, మొహమ్మద్ నబీ, రొమారియో షెపర్డ్, శ్రేయాస్ గోపాల్, గెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ మధ్వల్
చెన్నై సూపర్ కింగ్స్: రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అజింక్యా రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రహ్మాన్
Comments
Please login to add a commentAdd a comment