నమూనా చెక్కును అందజేస్తున్న మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
● మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
ముత్తుకూరు: ‘చంద్రబాబు నోటి నుంచి అబద్ధాలు తప్ప నిజాలు రావు. ఆయన్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు’ అని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ముత్తుకూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గురువారం వైఎస్సార్ ఆసరా సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 34,443 సంఘ బంధాలుండగా ఆసరా నాలుగో విడత కింద రూ.270.54 కోట్లు విడుదల చేశారని చెప్పారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 4,063 సంఘ బంధాలుండగా వాటికి రూ.30.55 కోట్లు విడుదలయ్యాయన్నారు. ముత్తుకూరు మండలంలో 790 సంఘ బంధాలకు రూ.5.72 కోట్లు ఇచ్చారన్నారు.
నెరవేరిన ఎన్నికల హామీలు
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చారని మంత్రి కాకాణి అన్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో మహిళలకు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు గెలిచిన తర్వాత గాలికొదిలేసి మోసం చేశారని గుర్తు చేశారు. మాట ఇవ్వడం, ఓట్లు దండుకోవడం, తర్వాత విస్మరించడం చంద్రబాబు నైజమని దుయ్యబట్టారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఇచ్చిన హామీని నెరవేర్చాలన్న లక్ష్యంతో జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ సాంబశివరెడ్డి, వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు మెట్ట విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణ, సర్పంచ్‌లు బూదూరు లక్ష్మి, కాకి మస్తానమ్మ, మండలాపాధ్యక్షురాలు జయలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు బందెల వెంకటరమణయ్య, నాయకులు మునుకూరు రవికుమార్‌రెడ్డి, దువ్వూరు చంద్రశేఖర్‌రెడ్డి, ఈదూరు రామమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment