ఏ హెచ్చరిక ఎందుకంటే.. | - | Sakshi
Sakshi News home page

ఏ హెచ్చరిక ఎందుకంటే..

Published Wed, Nov 27 2024 7:37 AM | Last Updated on Wed, Nov 27 2024 7:37 AM

ఏ హెచ

ఏ హెచ్చరిక ఎందుకంటే..

ముత్తుకూరు: జిల్లా వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. ఇవి కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా తుఫాన్‌ సమయంలో ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలను తెలుపుతుంటారు. ఇవి 1 నుంచి 11 వరకు ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.

1. ముందు చూపు : దూరంగా ఈదురుగాలులు ఏర్పడొచ్చు.

2. హెచ్చరిక : దూరంగా తుఫాన్‌ ఏర్పడి

ఉంది.

3. ముందు హెచ్చరిక : ఈదురుగాలులు ఈ రేవును తాకొచ్చు.

4. హెచ్చరిక : ఈ రేవును తుఫాన్‌ తాకినప్పటికీ ప్రమాదం లేదు.

5. అపాయం : రేవుకు దక్షిణ దిశలో సాధారణ తుఫాన్‌ ఏర్పడొచ్చు.

6. అపాయం : రేవుకు ఉత్తర దిశలో సాధారణ తుఫాన్‌ ఏర్పడవచ్చు.

7. అపాయం : సాధారణ తుఫాన్‌ ఈ రేవును తాకవచ్చు.

8. ఘోర అపాయం : రేవుకు దక్షిణ దిశలో పెద్ద తుఫాన్‌ ఏర్పడి దగ్గరగా తీరం దాటుతుంది.

9. ఘోర అపాయం : రేవుకు ఉత్తర దిశలో పెద్ద తుఫాన్‌ ఏర్పడి రేవు మీదుగా లేదా, దగ్గరగా తీరం దాటుతుంది.

10. ఘోర అపాయం : పెద్ద తుఫాన్‌ ఈ రేవును తాకుంది.

11. సమాచార వ్యవస్థ చిన్నాభిన్నం : వర్తమానం లేదు. ప్రాంతీయ అధికారి ప్రమాదం ఉందని భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఏ హెచ్చరిక ఎందుకంటే..1
1/1

ఏ హెచ్చరిక ఎందుకంటే..

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement