గుంత.. ఎన్నాళ్లీ చింత
కూటమి ప్రభుత్వం రోడ్ల అభివృద్ధిని మరిచిపోయింది. ఈ చిత్రంలో కనిపిస్తున్న భారీ గుంత ఆదూరుపల్లి నుంచి పెంచలకోనకు వెళ్లే రహదారిలో ఉంది. మెయిన్ రోడ్డులోనే ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వర్షం కురిస్తే నీళ్లు నిలిచి చిన్నపాటి చెరువును తలపిస్తోంది. పెంచలకోనలోని నృసింహుడి ఆలయానికి నిత్యం ప్రజలు వాహనాల్లో ఈ రోడ్డుపై రాకపోకలు సాగిస్తుంటారు. ఎంతో ముఖ్యమైన ఈ దారిలో పెద్ద గుంత ఉన్నా పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. – చేజర్ల
Comments
Please login to add a commentAdd a comment