సామాజిక న్యాయానికి జగన్ పెద్దపీట
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు(బారకాసు): గత వైఎస్సార్‌సీపీ పాలనలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారని మాజీ మంత్రి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మంగళవారం నగరంలోని డైకస్‌రోడ్డులో ఉన్న కాకాణి క్యాంప్ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. తొలుత బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు సిటీ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ దేశంలో ఆర్థికంగా, సామాజికంగా సమానత్వం ఉండాలని భావించి రిజర్వేషన్లు అందించిన మహనీయుడు అంబేడ్కర్ అని తెలిపారు. ప్రపంచంలోనే శక్తివంతమైన రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అందించారని చెప్పారు. చరిత్రలో నిలిచిపోయేలా విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించి, భవిష్యత్ తరాలకు ఆయన స్ఫూర్తిని చాటి చెప్పేలా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతగానో కృషి చేశారని తెలిపారు. జగన్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ ఆశయ సాధనకు తామంతా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కృషి చేయాలి
నెల్లూరు రూరల్: ‘ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఉందంటే దానికి కారణం రాజ్యాంగం. ప్రతిఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తితో దేశాభివృద్ధికి తమవంతు కృషి చేయాలి’ అని జేసీ కె.కార్తీక్ పిలుపునిచ్చారు. నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్‌ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. అనంతరం అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఆర్వో ఉదయభాస్కర్, కలెక్టరేట్ పరిపాలనాధికారి విజయకుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment