పెంచలకోనలో గోదాదేవికి క్షేత్రోత్సవం
రాపూరు: ధనుర్మాసాన్ని పురస్కరించుకుని జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో గోదాదేవికి నాలుగు శుక్రవారాలపాటు ప్రత్యేక పూజలు, క్షేత్రోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా మొదటి శుక్రవారం ఉత్సవ విగ్రహన్ని తిరుచ్చిపై కొలువుదీర్చి వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించి కోన మాడవీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించారు. తెల్లవారుజామున పెనుశిల లక్ష్మీనరసింహస్వామికి తిరుప్పావై, ప్రత్యేక పూజలు చేశారు. ఉభయకర్తలుగా మధుస్వామి, సువర్ణలక్ష్మి వ్యవహరించారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.24
సన్నవి : రూ.18
పండ్లు : రూ.10
నెల్లూరు పౌల్ట్రీ
అసోసియేషన్ ధరలు
బ్రాయిలర్ (లైవ్) : 100
లేయర్ (లైవ్) : 100
బ్రాయిలర్ చికెన్ : 186
బ్రాయిలర్ స్కిన్‌లెస్ : 206
లేయర్ చికెన్ : 170
Comments
Please login to add a commentAdd a comment