నెల్లూరు(పొగతోట): జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (డీడీసీఎంసీ) – దిశ (డీఐఎస్‌హెచ్‌ఏ) కమిటీ సమావేశం శనివారం జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో ఉదయం 10.30 గంటలకు జరుగుతుందని జెడ్పీ సీఈఓ విద్యారమ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్, ఎన్‌ఆర్‌ఎల్‌ఎం, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, జాతీయ సామాజిక సహాయక పథకం, ప్రధానమంత్రి ఆవాజ్ యోజన, స్వచ్ఛభారత్ మిషన్, జల్‌జీవన్ మిషన్, స్మార్ట్ సిటీ మిషన్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, జాతీయ ఆరోగ్య మిషన్, సమగ్ర శిక్ష అభియాన్, సమీకృత శిశు అభివృద్ధి, మధ్యాహ్న భోజన పథకం తదితర అంశాలపై సమావేశంలో చర్చిస్తామన్నారు. సమావేశానికి సభ్యులు, జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment