పార్టీని మరింత బలోపేతం చేస్తాం
నెల్లూరు (బారకాసు): వైఎస్సార్‌సీపీని జిల్లాలో క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేస్తామని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. నగరంలోని డైకస్‌రోడ్డు సమీపంలోని సాయిరాంనగర్‌లో నూతనంగా నిర్మించిన పార్టీ జిల్లా కార్యాలయాన్ని మాజీ మంత్రులు జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, నాయకులు, కార్యకర్తలతో కలిసి శుక్రవారం అట్టహాసంగా ప్రారంభించారు. తొలుత కార్యాలయ ఆవరణలో పార్టీ జెండాను ఎగుర వేశారు. తర్వాత ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జ్యోతి ప్రజ్వలన చేసి పలు విభాగాల గదులను ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో కాకాణి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వైఎస్సార్‌సీపీని బలోపేతం చేసేందుకు సమష్టిగా కృషి చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల్లో భాగంగా విద్యుత్ చార్జీల పెంపుపై ఈ నెల 27న ధర్నా నిర్వహిస్తామన్నారు. ప్రజలకు అండగా నిలిచి, వారిపై అదనపు భారం పడకుండా చూడాలనే లక్ష్యంతో పనిచేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన పార్టీ అనుబంధ విభాగాలకు సంబంధించిన జిల్లా అధ్యక్షుల పేర్లను కాకాణి వెల్లడించారు. మాజీ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, ఎమ్మెల్సీ, నెల్లూరు సిటీ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నెల్లూరు రూరల్ ఇన్‌చార్జి ఆనం విజయకుమార్‌రెడ్డి, వెంకటగిరి ఇన్‌చార్జి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, పార్టీ మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి ఖలీల్ అహ్మద్, డీసీసీబీ మాజీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వీరిచలపతి, పార్టీ నాయకులు సన్నపురెడ్డి పెంచలరెడ్డి, నాయకులు సయ్యద్‌హంజాహుస్సేన్, చిల్లకూరు సుధీర్‌రెడ్డి, నిరంజన్‌బాబురెడ్డితోపాటు పలువురు మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
పార్టీ జిల్లా నూతన కార్యాలయం ప్రారంభం
జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకుల హాజరు
Comments
Please login to add a commentAdd a comment