పథకాలకు తిలోధకాలు | - | Sakshi
Sakshi News home page

పథకాలకు తిలోధకాలు

Published Sat, Dec 21 2024 12:18 AM | Last Updated on Sat, Dec 21 2024 12:18 AM

పథకాల

పథకాలకు తిలోధకాలు

ఈ విద్యా సంవత్సరంలో

ట్యాబ్‌ల పంపిణీకి మంగళం

బైజూస్‌ బోధన, సీబీఎస్‌ఈ, టోఫెల్‌ విధానాలకు తిలోదకాలు

నాడు–నేడుకు పైసా విదల్చని

కూటమి ప్రభుత్వం

పాఠశాలల్లో కంపు కొడుతున్న టాయిలెట్స్‌

6 నెలలుగా ఆయాలు,

వాచ్‌మెన్‌లకు అందని జీతాలు

అమలు కాని తల్లికి వందనం పథకం

విద్యార్థులకు అరకొరగా విద్యాకానుక

జనవరి నుంచి అందని

విద్య, వసతి దీవెన

నాణ్యత లేని మధ్యాహ్న భోజనం,

కోడిగుడ్లు, చిక్కీలు

విద్యార్థులకు అర్ధ సంవత్సరం

పరీక్షలు జరుగుతున్నా.. నేటికీ చాలా

పాఠశాలల్లో పూరిస్థాయిలో పాఠ్య, నోటు పుస్తకాలు అందని దయనీయ పరిస్థితి. విద్యార్థులకు అందించిన 9 రకాల వస్తువులు నాణ్యత లేకపోవడంతో అప్పుడే పనికి రాకుండా పోయాయి. నాణ్యతలేని యూనిఫాం, సైజు సరిపోని బూట్లు, నాసిరకం బ్యాగులు విద్యార్థులకు ఇచ్చారు. మధ్యాహ్న

భోజనం కూడా నాణ్యత లేదని విద్యార్థులు వాపోతున్నారు. పౌష్టికాహారంగా అందించే కోడిగుడ్లు, చిక్కీలు నాణ్యత లేకపోవడం, గడువు ముగిసిన వాటిని ఇస్తుండడంపై తల్లిదండ్రులు

మండి పడుతున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలను అందిపుచ్చుకోవాలనే ఆకాంక్షతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్మార్ట్‌ బోధనకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ పేదింటి విద్యార్థుల కలలను కల్లలు చేసింది. విద్య పరంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లోనే మరో యాభై ఏళ్లు తపస్సు చేసినా.. సాధ్యం కాని ఇంగ్లిష్‌ మీడియం, బైజూస్‌ బోధన, సీబీఎస్‌ఈ సిలబస్‌, హైస్కూల్‌ ప్లస్‌లు, టోఫెల్‌ పరీక్ష వంటి విధానాలను అమలు చేసేందుకు గత ప్రభుత్వం యజ్ఞం చేస్తే.. కూటమి పాలకులు భగ్నం చేస్తున్నారు. పాఠశాలలను పూర్తిగా గాలికి వదిలేసింది. విద్యార్థులకు నాణ్యమైన భోజనమే కాదు.. పోష్టికాహారం కొరవడింది.

కూటమి ప్రభుత్వం

నెల్లూరు (టౌన్‌)/నెల్లూరు (బారకాసు): పేద విద్యార్థులు చదువుకునే ప్రభు త్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తోంది. నాణ్యౖ మెన విద్య, స్మార్ట్‌ బోధనకు మంగళం పాడే దిశగా అడు గులు వేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ చేశారు. జిల్లాలో 2022–23 విద్యా సంవత్సరంలో 18,513 మంది విద్యార్థులు, 2023–24లో 17,748 ట్యాబ్‌ లను అందించారు. వీరితో పాటు బోధించే ఉపాధ్యాయులకు సైతం ట్యాబ్‌లను అందజేశారు. ఈ ట్యాబ్‌ల్లో బైజూస్‌ కంటెంట్‌ను అప్‌లోడ్‌ చేశారు.

అభివృద్ధి పనులకు మంగళం

ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం తిలోదకాలిచ్చింది. జిల్లాలో తొలి విడతలో 1,059 పాఠశాలలను రూ.231.60 కోట్లతో అభివృద్ధి చేసింది. రెండో విడతలో 1,356 పాఠశాలలు, అంగన్‌వాడీలు, బీఈడీ, డైట్‌ కళాశాలల్లో రూ.466.94 కోట్లతో అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా రూ.190.45 కోట్ల నిధులు విడుదల చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు దాటినా.. నాడు–నేడు పనులకు ఒక్క పైసా కూడా నిధులు విడుదల చేయకపోవడం గమనార్హం. పాఠశాలల నిర్వహణను గాలికి వదిలేసింది. పాఠశాలల టాయిలెట్స్‌ కంపుకొడుతున్నాయి. శుభ్రతకు వినియోగించే రసాయనాలు, చీపుర్లు తదితర వాటికి నిధులు విడుదల చేయలేదు. అక్కడ పనిచేసే ఆయాలు, వాచ్‌మెన్లకు గత 6 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో వారు కూడా మొక్కుబడిగా పనిచేస్తున్నారు. దీంతో పాఠశాలల మరుగుదొడ్లు దుర్గంధం వెదజల్లుతున్నాయి. తాగునీరు అందించే ఆర్వో ప్లాంట్లు సైతం మరమ్మతులకు గురైతే బాటిని బాగు చేయించే దానికి నిధులు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది.

విద్యా, వసతి దీవెనలూ అంతే..

డిగ్రీ, ఇంజినీరింగ్‌ చదివే విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన కింద ఎంత ఫీజు ఉంటే అంత ఫీజును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది. వసతి దీవెన కింద ఏటా రూ.20 వేలు అందజేసింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. దీంతో ఆయా యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కొన్ని కళాశాలల్లో విద్యార్థులను పరీక్షలు రాయకుండా నిలిపి వేయడం, మరికొన్ని కళాశాలల్లో సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. గత ప్రభుత్వం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు జగనన్న విదేశీ విద్యాదీవెన కింద రూ.కోటి అందజేశారు. ఈ ప్రభుత్వం అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్య పేరు మార్చి ఇప్పటి వరకు ఒక్కరికీ కూడా ఖర్చు చేయని పరిస్థితి ఉంది.

విద్యాసంవత్సరం విద్యార్థులు మొత్తం ఉమ్మడి జిల్లాలో..

2019–20 2,51,811 మంది రూ.377,71,65,000,

2020–21 4,07,272 మంది రూ.610,90,80.000

విభజన జిల్లాలో..

2021–22 2,31,866 మంది రూ.347,79,90,000

2022–23 2,26,205 మంది రూ. 339,30,75,00

2023–24 4,10,779 మంది (కూటమి ప్రభుత్వం పెండింగ్‌)

నేడు

నాడు

నేటికీ అందని పాఠ్య, నోటు పుస్తకాలు

గత ప్రభుత్వ హయాంలో ఖర్చు చేసింది ఇప్పుడు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం పేరుతో రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. గత విద్యా సంవత్సరానికి సంబంధించి ఇవ్వాల్సిన తల్లికి వందనం పథకం ఊసే ఎత్తడంలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏటా జూన్‌లో అమ్మఒడి కింద తల్లుల బ్యాంక్‌ అకౌంట్‌ల్లో రూ.15 వేలు వంతున జమ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
పథకాలకు తిలోధకాలు 
1
1/3

పథకాలకు తిలోధకాలు

పథకాలకు తిలోధకాలు 
2
2/3

పథకాలకు తిలోధకాలు

పథకాలకు తిలోధకాలు 
3
3/3

పథకాలకు తిలోధకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement